హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే జీలకర్ర ..
- June 09, 2016
పోపులపెట్టెలో ప్రత్యేక స్థానం ఉండే జీలకర్ర వల్ల పదార్థాలకు రుచి మాత్రమే కాదు.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..ఐ రన్ పుష్కలంగా అందించే జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దానికి తోడు క్యాల్షియం, ఇనుము లోపించినప్పుడు బాలింతల్లో పాల కొరత ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు జీలకర్రను ఏ రూపంలో తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఫలితంగా అధిక బరువునీ అదుపులో ఉంచుకోవచ్చు. గ్యాస్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
*విటమిన్ ఎ, సిలు అధికంగా ఉండే జీలకర్రను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.
*అన్ని వయసు మహిళల్లో ప్రధాన సమస్య రక్తహీనతేనని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో ఇనుము లోపించడం వల్ల ప్రధానంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటివారికి జీలకర్ర చక్కని పరిష్కారం. శరీరంలో రక్తనిల్వల్ని పెంచడంలో జీలకర్ర చక్కని ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, అది చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







