జాయ్ ఆఫ్ మిడ్నైట్ కరక్.. మున్సిపాలిటీ క్లారిటీ

- May 22, 2024 , by Maagulf
జాయ్ ఆఫ్ మిడ్నైట్ కరక్.. మున్సిపాలిటీ క్లారిటీ

మనామా: అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ కరక్ దుకాణాలను డే అండ్ నైట్ తెరిచి ఉంచడానికి అనుమతించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. అయితే రాత్రిపూట ఒక కరక్ దుకాణాన్ని మాత్రమే తెరవడానికి అనుమతించినట్లు మునిసిపాలిటీ క్లారిటీ ఇచ్చింది. దీంతో వారు నిరాశకు గురయ్యారు. రాత్రిపూట కరక్ దుకాణాన్ని తెరవడానికి సంబంధించిన ప్రతిపాదనతో పాటు, ముహరక్ గవర్నరేట్‌లో మౌలిక సదుపాయాలు మరియు సేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన అనేక ఇతర ప్రతిపాదనలను మున్సిపాలిటీ మంగళవారం ఆమోదించింది.  ముహరక్ గ్రాండ్ పార్క్‌లో మల్టీ-అంతస్తుల ఈవెంట్ హాల్‌ను నిర్మించాలనే ప్రతిపాదన ఇందులో ఉంది. ఇది నివాసితులకు వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం కోసం ప్రత్యేక స్థలాన్ని అందిస్తుంది. దీంతోపాటు, ఈవెంట్ హాల్ మరియు పార్క్ సందర్శకుల ద్వారా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా మల్టీ-స్థాయి కార్ పార్కింగ్ నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. మాజీ ముహరక్ మున్సిపాలిటీ భవనాన్ని పబ్లిక్ పార్క్, వాణిజ్య సముదాయంగా మార్చే ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది.   షేక్ సల్మాన్ అవెన్యూలో పాదచారుల వంతెనను నిర్మించి, ఇప్పటికే ఉన్న రౌండ్‌అబౌట్‌ను తొలగించే ప్రతిపాదనకు కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.  బుసైటీన్‌లోని స్ట్రీట్ 64లో ఉన్న రౌండ్‌అబౌట్ వద్ద బహ్రెయిన్ జెండాను ప్రదర్శించే ఒక ప్రముఖ జెండా స్తంభాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com