మ్యాంగో ప్రాన్స్
- June 09, 2016
కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (శుభ్రం చేసినవి) - అరకేజీ, మామిడికాయలు - 2, కారం - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, గరంమసాలా పొడి -1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - అరకప్పు, ఉల్లిగడ్డలు - 2, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : రొయ్యలకు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, ఉప్పు బాగా కలిపి పక్కనుంచుకోవాలి. మామిడికాయల్ని ఉడికించి గుజ్జుని గ్రైండ్ చేసిపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత రొయ్యల్ని కూడా కలిపి సన్నని సెగమీద వేగనివ్వాలి. మామిడి గుజ్జుని కలిపి (కావాలనుకుంటే తగినంత నీరు చేర్చండి) నీరంతా ఇగిరిపోయాక దించేముందు మసాలాపొడి, కొత్తిమీరను చల్లుకోవాలి.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







