మరో కమెడియన్ హీరోగా
- June 09, 2016
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ప్రేమకథా చిత్రం లాంటి సినిమాలతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సప్తగిరి. ఒకప్పుడు వరుస సినిమాలతో యమా బిజీగా కనిపించిన సప్తగిరి కొద్ది రోజులుగా కనిపించటం మానేశాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తరువాత చెప్పుకోదగ్గ పాత్రల్లో కనిపించలేదు. ప్రస్తుతం తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సప్తగిరి.తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు భాషల్లో సప్తగిరి నటించటం విశేషం. అయితే ఈ సినిమాతో పాటు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరిగిపోతుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే తన మిత్రుల కోసం హీరోగా నటిస్తున్న సప్తగిరి, ముందు ముందు కమెడియన్ గానే కొనసాగాలని భావిస్తున్నాడు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







