ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..!

- May 25, 2024 , by Maagulf
ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..!

దుబాయ్: యూకే లేదా యూరోపియన్ యూనియన్ దేశాలలో సాధారణ పాస్‌పోర్ట్ కలిగి, అమెరికా గ్రీన్ కార్డ్ లేదా నివాస వీసాను కలిగి ఉన్న భారతీయులు యూఏఈకి వ‌చ్చేందుకు వీసా-ఆన్-అరైవల్‌ను పొందేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్వల్పకాలిక వీసాను ఒక సారి మాత్రమే మరో 14 రోజులు పొడిగించవచ్చని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) పేర్కొంది. అర్హత కలిగిన భారతీయ ప్రయాణికులకు కొన్ని సంవత్సరాలుగా యూఏఈ విమానాశ్రయాలలో వీసా ఆన్ అరైవల్ మంజూరు చేయబడుతోంది. ప్రయాణికులు తమ విమానాల నుండి దిగిన తర్వాత వీసా సాధారణంగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద స్టాంప్ చేస్తున్నారు. ఇప్పుడు, దుబాయ్‌కి వెళ్లే ప్రయాణికులు ముందుగా సర్వీస్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్‌కు అర్హులైన భారతీయ పర్యాటకులు ముందుగా GDRFA వెబ్‌సైట్ https://smart.gdrfad.gov.ae కి లాగిన్ అవ్వాలి. వారు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి.  రుసుము కింద Dh253 చెల్లించాలి. 48 గంటల్లో ఆమోదం పొందిన తర్వాత, వీసా వినియోగదారు ఇమెయిల్‌కు పంపబడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌లో తమ ప్రయాణాన్ని బుక్ చేసుకున్న కొంతమంది భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com