రామన్న అక్షయపాత్ర
- July 02, 2015
అనగనగా ఒక ఊరిలో రామన్న అనే ఒక మంచి వ్యక్తి ఉండేవాడు. ఎప్పుడూ ఒళ్లు వంచి కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అదే ఊళ్లో మట్టయ్య అనే ఒక చెడ్డవ్యక్తి ఉండేవాడు. ఏ పనీ పాట లేకుండా అందర్నీ హింసిస్తూ, వారి దగ్గర తనకి దొరికింది దోచుకుని జీవితం సాగించేవాడు. అంతే కాదు పెద్ద గూండాలా వ్యవహరించేవాడు. దాంతో ఊరి జనం అంతా ఎలా ఈ మట్టయ్య బారి నుండి తప్పించుకోవాలా? వాడికి ఎదురు చెప్పలేక వాడగిందల్లా ఇచ్చేసి వాడికి భయపడుతూ బతుకు సాగిస్తూండేవారు. ఒకరోజు రామన్న తన పొలంలో దేని కోసమో ఒం గుంత తవ్వుతుండగా, గునపానికి ఏదో రాయిలా తగిలి, శబ్ధం వినిపించింది. అదేమిటా అని మరికొంత లోతుకు తవ్వి చూడగా ఒక పెద్ద వంట పాత్ర బయటపడిరది. నేను దీన్ని ఏం చేసుకోవాలి? మరికొంచెం లోపలికి తవ్వి చూస్తానని, తవ్వి చూడగా ఏం కనిపించలేదు. దాంతో నిరాశతో ఆ పాత్రని పక్కన పెట్టి అతని ఒంటి మీదన్న తుండుని తీసి ఆ పాత్రలోకి విసిరి, చీకటి కావడంతో ఆ పక్కనే ఉన్న చెట్టు కింద ఒక కునుకు తీసాడు. తెల్లవారి లేచి చూడగా ఆ పాత్రలో రాత్రి తను విసిరేసిన తుండు గుడ్డ, వంద తుండు గుడ్డలుగా మారిపోయాయి. దాంతో అతను దాంట్లో ఒక మామిడి కాయను వేసి చూడగా వంద మామిడి కాయలు బయటికి వచ్చాయి. ఎంతో ఆశ్చర్యపోయిన రామన్న ఇది మాయా పాత్ర అయ్యి ఉంటుంది. దేవుడికి ఇన్నాళ్లకు నాపై కరుణ కలిగి నాకీ అక్షయపాత్రను ప్రసాదించి ఉంటాడు. నేను దీన్ని ఉపయోగించి ధనవంతున్ని అవుతాను అనుకొని రకరకాల వ్యాపారాలు చేసి తద్వారా ఊరిలో ఒక పెద్ద ధనవంతుడుగా ఎదిగాడు. ఈ విషయం తెలిసిన మట్టయ్య ఎలాగైనా ఆ పాత్రను తాను దొంగిలించాలని తలచి, ఒకరోజు రాత్రి రామన్న ఇంటికి దొంగతనానికి బయల్దేరాడు. అక్కడ ఒక గదిలో మూలన ఈ అక్షయపాత్రను చూశాడు. దాని మహిమను తన కళ్లతో చూడాలని దాంట్లో ఒక వడ్ల గింజను వేశాడు. దానిలోంచి వంద వడ్ల గింజలు బయటికి వచ్చాయి. ఇంతలో రామన్న అక్కడికి రావడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి మట్టయ్య పొరపాటుగా ఆ అక్షయపాత్రలోకి జారి పడిపోయాడు. దాంతో అందులోంచి వంద మంది మట్టయ్యలు బయటికి వచ్చి ఒకరినొకరు ఆ పాత్ర నాదంటే నాదని దెబ్బలాడుకుంటూ, కత్తులతో పొడుచుకొని మొత్తం వంద మంది మట్టయ్యలు అక్కడికక్కడే చనిపోయారు. దాంతో ఆ ఊరికి మట్టయ్య పీడ వదిలిపోవడంతో, రామన్న అప్పటినుండి ఆ పాత్రను పేదవారి కోసం, మంచి పనుల కోసం ఉపయోగిస్తూ ఇంకా ఊరి జనం దగ్గర మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







