సుందర్.సి చారిత్రాత్మక కథతో సూర్య..
- June 09, 2016
చాలా వరకు భిన్నమైన, వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుని నటిస్తుంటారు సూర్య. ఇటీవల విడుదలైన '24' కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. అందులో త్రిపాత్రాభినయంతో మెప్పించారు. హరి దర్శకత్వంలోని 'సింగం' సీరీస్ చిత్రాల్లో నటిస్తూ దక్షిణాది బాక్సాపీసును షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి మూడోభాగం 'ఎస్ 3'గా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. నిన్నటి వరకు 'అరణ్మనై', 'అరణ్మనై 2' చిత్రాలతో దెయ్యాల ట్రెండ్ చుట్టూ తిరిగిన సుందర్.సి చారిత్రాత్మక కథతో సూర్య వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.కథ నచ్చడంతో సూర్య నటించడానికి ఒప్పుకున్నారని, ప్రస్తుతం డేట్స్ తీసుకునే పనిలో నిర్మాణ సంస్థ ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇందులో కథానాయిక పాత్ర కోసం దీపికాపదుకొనేతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం విడుదల కానుంది. కమల కన్నన్ ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ సమకూర్చనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







