మా టీవీ అవార్డుల కార్యక్రమాన్ని భారీ స్థాయిలో

- June 09, 2016 , by Maagulf
మా టీవీ అవార్డుల కార్యక్రమాన్ని భారీ స్థాయిలో

మా టీవి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ చాలా వేగంగా ఎదిగింది. నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్ చిరంజీవి అల్లు అరవింద్ లాంటి దిగ్గజాలు డైరెక్టర్ లుగా ఉండటంతో వారంతా కలిసి ఆ ఛానల్ ను టాప్ రేంజ్ కి తీసుకువెళ్ళడమే కాకుండా స్టార్ టీవీ లాంటి బడా సంస్థకు వేల కోట్ల డీల్ కు ఈఛానల్ ను ఇచ్చివేశారు.స్టార్ చేతుల్లోకి వెళ్లాక 'మా' రేంజి మరింత పెరిగింది. 'స్టార్' చేతికి వెళ్ళిన తరువాత మొట్టమొదటిసారి జరగబోతున్న మా టీవీ అవార్డుల కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా జరిగే మా టీవీ అవార్డుల ఫంక్షన్ ఒకప్పుడు అంత క్రేజ్ లేక పోయినా ఈసారి రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు కూడ కొండెక్కేసిన నేపథ్యంలో ఈసారి జరగబోతున్న మా టీవీ అవార్డ్స్ ను ప్రత్యేకంగా చూస్తున్నారు.ఈసారి ఈఅవార్డుల వేడుకను నిర్వహించే తీరు కూడాచాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి ఆదివారం 12వ తారీఖున జరగబోతున్నఈవేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా అక్కడ ఉంటారు అన్న వార్తలు వస్తున్నాయి. చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహిస్తున్న 'మా' యాజమాన్యం ఈసారి కార్యక్రమం కోసం 5కోట్లు బడ్జెట్ కేటయించినట్లు టాక్ ఈసారి చాలా స్పెషల్ అనిపించే కార్యక్రమాలు ప్లాన్ చేసారు అన్న వార్తలువస్తున్నాయి.మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున తో సహా చాలామంది ప్రముఖులు ఈవేడుకలో సందడి చేయనున్నారు. ఇదిఇలాఉండగా మెగాస్టార్ చిరంజీవి తన 150వ మూవీ కోసం రిహార్సల్ గా చేయనున్నలైవ్ డాన్స్ షో పై అందరి దృష్టి ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి చిరంజీవి కసరత్తు మొదలుపెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు 'మా' టీవీ అవార్డ్స్ నైట్ రిహార్సల్స్ జరుగుతున్న ఫ్లోర్‌లో చిరంజీవి కూడ గత రెండు రోజులుగా తన డాన్స్ ప్రాక్టీసు చేస్తున్నట్లు టాక్. చిరూ తన 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా మాటీవీ 'వెల్‌కమ్ బ్యాక్' ప్రొగ్రామ్ పేరిట నిర్వహించే ఈవెంట్‌లో చిరూ ఇలా సందడి చేయడం కొసమెరుపుగా మారనుంది. ఏమైనా ప్రస్తుతం ఫిలింనగర్ లో చిరంజీవి లైవ్ డాన్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com