ఆటిజం బాధితుల కోసం NATS ముందడుగు
- May 26, 2024
హైదరాబాద్: అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టమోచ్చిన అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా హైదరాబాద్‌లో ఆటిజం బాధితుల కోసం ఆటిజం కేర్ ఆన్ వీల్స్ పేరిట ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసింది.. ఆటిజం బాధితులకు, దివ్యాంగులకు సేవలు అందించే స్పర్శ ఫౌండేషన్‌కు ఈ వాహనాన్ని అందించింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఆటిజం బాధితుల కోసం ఏదో ఒక్కటి చేయాలనే సంకల్పంతో నాట్స్ డల్లాస్ కో ఆర్డినేటర్ రవి తాండ్ర చూపిన చొరవ ప్రశంసనీయమని బాపు నూతి ప్రశంసించారు. ఆటిజం బాధితుల కోసం అటు అమెరికాలో నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. దివ్యాంగులకు అండగా నిలవాలన్న సామాజిక బాధ్యత మనందరికి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి, నాట్స్ డల్లాస్ కో ఆర్డినేటర్ రవి తాండ్ర తమ కోసం సమయం, ధనం వెచ్చించి చేస్తున్న సేవా కార్యక్రమాలను అఖిల భారత దివ్యాంగుల సంఘం నాయకులు కొల్లి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల కోసం నాట్స్ నాయకులు చేస్తున్న కృషిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!