చరిత్ర సృష్టించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్

- May 26, 2024 , by Maagulf
చరిత్ర సృష్టించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్

న్యూ ఢిల్లీ: భార‌త స్టార్ జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో గోల్ట్ మెడల్ గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. ఉజ్బెకిస్థాన్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ బంగారు పతకం సాధించింది.

మొత్తం 8 మంది జిమ్నాస్ట్‌లు ఫైనల్ చేరగా.. అసాధారణ ప్రదర్శనతో దీపా కర్మాకర్ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకుంది. చివరిసారిగా 2015లో ఇదే టోర్నీలో కాంస్య పతకాన్ని అందుకున్న దీపా కర్మాకర్.. తాజా ఎడిషన్‌లో అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com