IPL 2024: కోల్‌కతాదే ఐపీఎల్ కప్..

- May 26, 2024 , by Maagulf
IPL 2024: కోల్‌కతాదే ఐపీఎల్ కప్..

చెన్నై: ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఛాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ టీమ్ హైదరాబాద్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను ఎగరేసుకుపోయింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ సునీల్ నరైన్ తొందరగా ఔటైనా వెంకటేశ్‌ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో విజృంభించాడు. మరో ఓపెనర్ గుర్బాజ్‌ (39) కూడా రాణించాడు. శ్రేయస్‌ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో షాబాజ్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com