TANA మాజీ అధ్యక్షునితో యూఏఈ తెలుగు అసోసియేషన్ వారి ఆత్మీయ సమ్మేళనం
- May 27, 2024
దుబాయ్: తెలుగు అసోసియేషన్-యూఏఈ కార్యనిర్వాహక బృందం 24న శుక్రవారం నాడు దుబాయ్ లోని ఇండియన్ క్లబ్ నందు తానా మాజీ అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
లావు అంజయ్య చౌదరి ఒకటిన్నర దశాబ్ద కాలములో తానా యందు వివిధ విభాగాలలో, కీలక పదవులలో బాధ్యతలను నిర్వహించి విశేషమైన సేవలందించారు.వారి అకుంఠిత సేవా తత్పరత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు వారిని తానా లో టీం కో-ఆర్డినేటర్ నుండి మొదలుకొని అత్యంత కీలక పదవి అయిన అధ్యక్ష పదవి వరకు ఎదిగేలా దోహదపడింది. వీరి నాయకత్వంలో తానా కేర్స్ మరియు తానా టీమ్స్ ద్వారా వందల కొలది విపత్కర పరిస్థితులలో అమెరికాలోని తెలుగు వారికి సహాయ, సహకారములు అందించారు.
లావు అంజయ్య చౌదరి తానా సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా అమెరికాలోని తెలుగు వారికి అందిస్తున్న సేవా కార్యక్రమా ల గురించి వివరించారు. తానా సుధీర్ఘ కాలముగా సేవలందించటానికి ప్రధాన కారణమైన సంస్థాగత నిర్మాణము, వివిధ విభాగాల రూప కల్పన, కార్యక్రమాల నిర్వహణా విధానాలు, బోర్డ్ మరియూ ఎక్జిక్యూటివ్ కమిటీల పరస్పర సహకారములు, నిధుల సేకరణ వంటి అనేక అంశాల పై ఎంతో ఓపికగా వివరించారు.
తెలుగు అసోసియేషన్ ప్రస్తుత మరియు పూర్వ కార్యనిర్వాహక బృందముల అధ్యక్షులు తెలుగు అసోసియేషన్ యూఏఈ ఆవిర్భావము నుండి నేటి వరకు నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమాలను వివరించారు.లావు అంజయ్య చౌదరి తెలుగు అసోసియేషన్ యూఏఈ ప్రారంభించిన కొద్ది సంవత్సరాలలోనే ఇన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించటము ఎంతో సంతోషించదగిన విషయమని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలతో యూఏఈలోని తెలుగు వారికి సేవలందించాలని తానా తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.
యూఏఈ తెలుగు అసోసియేషన్ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ లావు అంజయ్య చౌదరి తమ అమూల్యమైన సలహాలు అందజేసారు.ఈనాటి ఆత్మీయ సమ్మేళానికి చొరవ తీసుకున్నందుకు తెలుగు అసోసియేషన్ ని అభినందిస్తూ, ఇటువంటి సమ్మేళనాలు మున్ముందు కూడా చేపట్టాలని, తద్వారా తానా తరపున మరియు యూఏఈ తెలుగు అసోసియేషన్ పరస్పర సహకారము ఇచ్చిపుచ్చుకోవాలని అభిలషించారు.
లావు అంజయ్య చౌదరి తానా మరియు ఇతర తెలుగు సంఘాల ద్వారా అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజానికి అందజేసిన సేవలు, యూఏఈ తెలుగు అసోసియేషన్ కి ఎంతో స్పూర్తిదాయకం కాగలవని కార్యక్రమానికి విచ్చేసిన కార్యనిర్వహక బృంద సభ్యులు వ్యక్తపరుస్తూ తమ హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేసారు.
యూఏఈ తెలుగు అసోసియేషన్ తరపున లావు అంజయ్య చౌదరిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరపున ప్రస్తుత కార్య నిర్వాహక బృందము నుంచి చైర్మన్ వివేకానంద్ బలుస, ప్రెసిడెంట్ మసివుద్దిన్, జనరల్ సెక్రెటరి విజయ భాస్కర్, ట్రెజరర్ శ్రీనివస్ గౌడ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల, ఆంధ్రా సంక్షేమ విభాగ డైరెక్టర్ శ్రీధర్, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ భీం శంకర్ బంగారి, తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ చైతన్య చకినాల, పూర్వ కార్య నిర్వాహక బృందం నుంచి చైర్మన్ దినేష్ కుమార్ ఉగ్గిన ట్రెజరర్ మురళీ కృష్ణ నూకల, తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ షేక్ షా వలి విచ్చేసారు. వీరితో పాటుగా ఫారెస్ట్ నేషన్ ఎండీ శరత్ నల్లమోతు కార్యక్రమానికి విచ్చేసారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!