యూఏఈ గోల్డెన్ వీసా..మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
- May 28, 2024
దుబాయ్: యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన భారతీయుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరారు. తాజాగా యూఏఈ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ టాలీవుడ్ మెగాస్టార్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన 10 సంవత్సరాల యూఏఈ గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఇటీవల రజనీకాంత్ కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన విషయం తెలిసిందే.
యూఏఈ ప్రభుత్వం మొదటిసారిగా 2019లో గోల్డెన్ వీసా కాన్సెప్ట్ తీసుకొచ్చింది. స్పాన్సర్ అవసరం లేకుండా దేశంలో నివసించడానికి, పని చేయడానికి మరియు చదువుకోవడానికి ఈ గోల్డెన్ వీసా వీలు కల్పిస్తుంది. వీసా హోల్డర్లు యూఏఈ ప్రధాన భూభాగంలో వారి వ్యాపారాలపై 100 శాతం మేనేజ్మెంట్ హక్కును కలిగి ఉంటారు. ఐదు లేదా 10 సంవత్సరాల కాలానికి ఉండే ఈ వీసాలు ఆటోమెటిగ్గా పునరుద్ధరించబడతాయి. చిరంజీవి కంటే ముందు, మెగా ఫ్యామిలీ కోడలు మరియు నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని తోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబంలో ఈ వీసాను అందుకున్నారు. అయితే, తాజాగా చిరంజీవికి దక్కిన గౌరవం పట్ల యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సోనూ సూద్, రణ్ వీర్ సింగ్, సానియా మీర్జా, సిరాశ్రీ మరియు మౌని రాయ్ ఇప్పటకే ఈ యూఏఈ గోల్డెన్ వీసాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







