కొత్త హజ్, ఉమ్రా రూల్స్.. ఉల్లంఘనలకు Dh50,000 వరకు జరిమానా

- May 28, 2024 , by Maagulf
కొత్త హజ్, ఉమ్రా రూల్స్.. ఉల్లంఘనలకు Dh50,000 వరకు జరిమానా

యూఏఈ: ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ నుండి ముందస్తు అనుమతి లేకుండా యూఏఈలోని ఆపరేటర్లు హజ్ లేదా ఉమ్రా కోసం దరఖాస్తులు లేదా అభ్యర్థనలను స్వీకరించలేరు. ఈ మేరకు అథారిటీ ప్రకటించింది. సేవలను దుర్వినియోగం చేస్తే భారీ జరిమానాలను అధికార యంత్రాంగం ప్రకటించింది. వ్యక్తులు, ప్రచార నిర్వాహకులు మరియు కార్యాలయాలు చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడితే 50,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధించనున్నారు.  ఆపరేటర్లు హజ్ లేదా ఉమ్రా ట్రిప్‌లను నిర్వహించడానికి లేదా ప్రచారం చేయడానికి ముందు అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి పొందవలసి ఉంటుంది. దీనితోపాటు లైసెన్స్ లేకుండా తీర్థయాత్ర కోసం విరాళాలు సేకరించడం లేదా స్వీకరించడాన్ని నిషేధించారు.  కొత్త రూల్స్ ను దేశంలోని లైసెన్స్ పొందిన ఆపరేటర్లు స్వాగతించారు. కఠినమైన జరిమానా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com