రష్మికను తెగ వాడేస్తున్న ఆనంద్ దేవరకొండ.!
- May 29, 2024
నేషనల్ క్రష్ రష్మిక మండన్నా ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా వర్క్ చేస్తుంది. ఆమె సినిమాలనే కాకుండా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమాలను సైతం ప్రమోట్ చేయడంలో బిజీగా వుంది.
గతంలోనూ ఆనంద్ దేవరకొండ నటించిన సినిమాకి రష్మిక మండన్నా ప్రమోషన్ హెల్ప్ చేసింది. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘గం గం గణేశా’ సినిమాకీ తన సహాయ సహకారాలు అందిస్తోంది.
ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు భీభత్సంగా చేస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన ఓ ఈవెంట్‌కి రష్మిక స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసింది.
‘నువ్వు నా ఫ్యామిలీరా..’ అంటూ ఆనంద్ దేవరకొండను చాలా ప్యాంపర్ చేసింది రష్మిక మండన్నా స్టేజ్ ముఖంగా. దాంతో, ఓ వైపు దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక మండన్నాకి వున్న సాన్నిహిత్యం.. దాంతో పాటూ, విజయ్ దేవరకొండను రష్మిక త్వరలో వివాహం చేసుకోబోతోందన్న ప్రచారం.. వీటన్నింటికీ ఇంకాస్త బలం చేకూరిందని చెప్పొచ్చు.
ఆ సంగతి అటుంచితే, రష్మిక ప్రమోట్ చేస్తున్న ‘గంగంగణేశా’ సినిమా ప్రోమోలకి పాజిటివ్ రెస్పాన్స్ బాగుంది. ఆల్రెడీ ‘బేబీ’ సినిమాతో హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ‘గంగంగణేశా’ సినిమాతో హిట్టు కొట్టడానికి రెడీగా వున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!