ఆర్జీవీ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్
- May 30, 2024
హైదరాబాద్: వ్యూహం, శపథం సినిమాల తర్వాత కాస్త సైలెంట్ అయిపోయారు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ మధ్యన ప్రేక్షకులే అన్ని నిర్ణయించి సినిమా తీస్తే ఎలా ఉంటుందని యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్టుతో వార్తల్లో నిలిచాడు. అంటే ఆడియెన్సే సినిమాకు సంబందించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అన్ని టెక్నీషియన్లు ఎంచుకోవాలని, ఓటింగ్ లో అగ్రస్థానంలో ఉన్నవారితో తానే నిర్మాతగా సినిమా తీస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. మరి ఈ కాన్సెప్ట్ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ తాజాగా ఒక ఆసక్తికరమైన వార్తతో మన ముందుకు వచ్చాడు ఆర్జీవీ. అదేంటంటే.. రామ్ గోపాల్ వర్మను సెన్సేషనల్ డైరెక్టర్ గా మార్చిన సినిమా శివ. ఈ సినిమాతోనే అక్కినేని నాగార్జునను స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. నాగార్జున సతీమణి అమలా ఇందులో కథానాయికగా నటించింది. అలాగే జేడీ చక్రవర్తి ఇందులో విలన్ గా కనిపించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన శివ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది . డైరెక్టర్ ఆర్జీవీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు ఆర్జీవీ. ఇందులో శివ సినిమాలో నాగార్జున స్టైల్ లో సైకిల్ తెంచుతూ కనిపించారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ డైరెక్టర్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!