పోలీసులతో నివేతా పేతురాజ్‌ గొడవ! వీడియో వైరల్

- May 30, 2024 , by Maagulf
పోలీసులతో నివేతా పేతురాజ్‌ గొడవ! వీడియో వైరల్

టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్‌.. పోలీసుల‌తో గొడవకు దిగారు. కారులో ప్రయాణిస్తోన్న నివేతను ఆపిన పోలీసులు డిక్కీ ఓపెన్‌ చేయాలని కోరగా.. అందుకు ఆమె నిరాకరించారు. అంతేకాదు వీడియో రికార్డు చేస్తున్న ఓ పోలీస్ ఫోన్‌ను లాగేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ డిక్కీలో ఏముందో అని వీడియో చూసిన ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఏం జరిగిందంటే…

కారు డిక్కీ ఓపెన్‌ చేయాలని పోలీసులు కోరగా.. నివేతా పేతురాజ్‌ కోపంగా మాట్లాడారు. ‘రోడ్డు వరకే వెళ్తున్నాను. లోపల ఏమీ లేదు. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చూపిస్తా. డిక్కీలో ఏం లేవు’ అని నివేతా అన్నారు. అదంతా ఓకే మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అని పోలీసులు అనగా.. ‘డిక్కీలో ఏమీ లేడి సర్. నేను డిక్కీ ఓపెన్‌ చేయను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఎంత చెప్పినా మీకు అర్థం కాదు’ అని నివేతా కోపంగా అన్నారు. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ పోలీస్ ఫోన్‌ను ఆమె లాగేసుకుని గొడవకు దిగారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

చెన్నైకి చెందిన నివేతా పేతురాజ్‌ ‘మెంటల్‌ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. చిత్రలహరితో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. విశ్వక్‌ సేన్‌తో కలిసి నటించిన పాగల్‌, దాస్‌ కా దమ్కీ చిత్రాలలో మంచి నటనతో ఆకట్టుకున్నారు. గత రెండేళ్లుగా ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు. అటు తమిళం కూడా చేతిలో సినిమాలు లేవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com