తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా
- May 30, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చిహ్నం కొత్త లోగో ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. చివరి నిమిషంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ కారణంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని… ఇది సరికాదని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. కాగా, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!