తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం.. మార్చిన గీతం ఇదే!
- May 30, 2024
జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. ఈ రోజు వారితో సీఎం జరిపిన సమావేశంలో జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రతిపాదించారు.
ఈ సమావేశంలోనే జయ జయ తెలంగాణ గీతాన్ని కీరవాణి, సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించింది. గీతంపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతల, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతంలో మగ్దుం మొహియుద్దీన్, షేక్ బందగి, కొమరం భీమ్ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు చేర్చాలని సీపీఐ సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్ర పక్షాల మద్దతు లభించిందని సీఎం రేవంత్ సమావేశం అనంతరం ప్రకటించినట్లు సమాచారం. ఈ గీతాన్ని జూన్ 2న జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం వెల్లడించినట్లు తెలుస్తోంది. తెలంగాణ చిహ్నంపై కూడా కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పినట్లు సమాచారం. మరో సమావేశం తర్వాత చిహ్నాన్ని ఖరారు చేస్తామని సీఎం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జూన్ 2నే తెలంగాణ రాష్ట్ర కొత్త రాజముద్రను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







