కార్తికేయ లిస్టులో మరో హిట్టు పడిపోయిందిగా.!
- June 01, 2024
కార్తికేయ మంచి నటుడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానే నటించేశాడు. అది కూడా అజిత్ వంటి ఓ పవర్ ఫుల్ కటౌట్ వున్న నటుడితో పోటీగా. ‘వలిమై’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
నువ్వా నేనా అన్నట్లుగా ఆ సినిమాలో అజిత్‌తో విలనిజం చూపించాడు. ‘భజే వాయు వేగం’ అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా స్ర్కీన్‌ప్లే టైటిల్‌కి తగ్గట్లుగానే రేస్ స్పీడుతో పరుగెత్తించడంతో సగటు ప్రేక్షకుడికి బాగానే కనెక్ట్ అయ్యింది.
దాంతో, కార్తికేయ లిస్టులో ‘భజే వాయు వేగం’ పేరుతో మరో హిట్టు చేరిపోయింది. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయ్. మంచి రైటింగ్స్, రేటింగ్స్ పడ్డాయ్.
సో, హాట్ సమ్మర్లో కూల్ మూవీగా ‘భజే వాయు వేగం’ సక్సెస్ లిస్టులో చేరిపోయింది. కార్తికేయకు ఇది మంచి టైమింగే. ఎలాగూ హీరోగానే కాకుండా డిఫరెంట్ పవర్ ఫుల్ రోల్స్‌లోనూ కార్తికేయ మెప్పించగలడు. ఏమో ఏం చెప్పగలం.! ఏ మెగా హీరో సినిమాకో విలన్‌గా సెట్ అయిపోయినా అయిపోతాడు.
లేదంటే, కార్తికేయను నమ్మి, మంచి ప్రొడక్షన్ బ్యానర్ ముందుకొచ్చి ఓ బారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ని ప్లాన్ చేసినా చేయాలనుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







