రియల్ ఎస్టేట్ చట్టాల ఉల్లంఘన..డెవలపర్‌లకు భారీ ఫైన్

- June 03, 2024 , by Maagulf
రియల్ ఎస్టేట్ చట్టాల ఉల్లంఘన..డెవలపర్‌లకు భారీ ఫైన్

దుబాయ్: రియల్ ఎస్టేట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముడు డెవలప్ కంపెనీలకు ఒక్కొక్కరికి 500,000 దిర్హామ్‌లు జరిమానా విధించారు. ఆఫ్-ప్లాన్ ప్రాజెక్ట్‌ల కోసం తప్పనిసరి రిజిస్ట్రేషన్ విధానాలను పూర్తి చేయకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడం,  మార్కెటింగ్ చేసినందుకు డెవలపర్‌లకు ఫైన్ విధించారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (డిఎల్‌డి) డెవలపర్‌ల పేర్లను పేర్కొనలేదు. అయితే వారు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ఎస్క్రో ఖాతాలపై చట్టాన్ని ఉల్లంఘించారని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ ఎస్క్రో ఖాతా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం నియమించబడింది. ఇక్కడ ఆఫ్-ప్లాన్ యూనిట్ల కొనుగోలుదారుల నుండి సేకరించిన నిధులు జమ చేయబడతాయి. ఈ ఖాతా విక్రయించబడిన యూనిట్ల నిర్మాణ ప్రక్రియను నియంత్రించడం, పెట్టుబడిదారుల హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని రియల్ ఎస్టేట్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అలీ అబ్దుల్లా అల్ అలీ తెలిపారు. ఆఫ్-ప్లాన్ ప్రాజెక్ట్‌లు లైసెన్స్ పొంది, ఎస్క్రో ఖాతాతో రిజిస్టర్ అయ్యాయని ధృవీకరించాలని పెట్టుబడిదారులను కోరారు. వారు DLD యొక్క దుబాయ్ REST అప్లికేషన్ ద్వారా దీన్ని తనిఖీ చేయవచ్చని సూచించారు. పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ యొక్క ఎస్క్రో ఖాతా వెలుపల ఎటువంటి చెల్లింపులు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com