ఉమ్మడి గల్ఫ్ సహకారం పై అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ చర్చలు
- June 03, 2024
యూఏఈ: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో సంబంధాలు బలోపేతం చేసే మార్గాలపై సమీక్షించారు. ముఖ్యంగా వాటిని మెరుగుపరచడంలో సహకారం గురించి కీలక చర్చలు జరిపారు. ఉమ్మడి గల్ఫ్ సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా సమీక్షించారు. అబుదాబిలో జరిగిన చర్చల సందర్భంగా, హెచ్‌హెచ్ అమీర్ మరియు యూఏఈ అధ్యక్షుడు ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అదే సమయంలో పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రస్తుత సమస్యలపై, ముఖ్యంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఈ చర్చల్లో ఇరుదేశాల కీలక నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..