ఇజ్రాయెల్ పౌరుల పై మాల్దీవులు నిషేధం!
- June 03, 2024
మాలే: ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో కాలుపెట్టకుండా నిషేధం విధించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. గాజాపై దాడులపై నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించాలన్న స్థానికుల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్‌లాండ్ సెక్యూరిటీ, టెక్నాలజీ శాఖ మంత్రి అలీ ఇసుహాన్ మీడియాకు తెలిపారు. నిషేధం విధింపు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాల్దీవులను ఏటా 10 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా వారిలో 15 వేల మంది ఇజ్రాయెలీ పౌరులు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!