రేవ్ పార్టీ కేసులో నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
- June 04, 2024
బెంగళూరు: బెంగుళూర్ రేవ్ పార్టీ లో పోలీసులకు అడ్డంగా దొరికిన టాలీవుడ్ నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్ట్. ఈ కేసులో సోమవారం హేమను అరెస్ట్ చేసిన బెంగుళూరు సీసీబీ పోలీసులు వైద్య పరీక్షల అనంతరం రాత్రి ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో హేమకు మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు.
గత నెల 20వ తేదీన బెంగుళూరులోని ఓ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి నటి హేమతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు హాజరైన విషయం తెలిసిందే. ఈ పార్టీకి సంబంధించి దాదాపు 150 మందిపై సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో డ్రగ్స్ సేవించారన్న అనుమానంతో 103 మంది నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. హేమ కూడా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు హేమకు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. వివిధ కారణాలతో రెండు సార్లు పోలీసుల దర్యాప్తుకు హేమ హాజరుకాలేదు. దీంతో మరోసారి పోలీసులు ఆమెకు నోటీసులు ఇవ్వగా.. మూడోసారి హాజరయ్యారు. విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..