లోక్సభ ఎన్నికల్లో రికార్డు.. 7.8లక్షల ఓట్ల ఆధిక్యంలో ఇండోర్ అభ్యర్థి
- June 04, 2024
మధ్యప్రదేశ్: లోక్సభ ఎన్నికల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న ఎన్డీఏ నినాదం నినాదంలానే మిగిలిపోతోంది. బీజేపీ కూటమికి ఇండియా కూటమి గట్టిగా పోటీనిస్తోంది.
పలు నియోజకవర్గాల్లో రికార్డు మెజార్టీలు సాధిస్తోంది.మరో వైపు సీట్లు తగ్గినా.. బీజేపీ కూడా చాలా నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు సొంతం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండోర్లో భారీ మెజార్టీ నమోదయింది.
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాని సరికొత్త రికార్డు దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆయన 7,89,625 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. లోక్సభ చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే పేరుతో అత్యధిక మెజార్టీ రికార్డు (6.9లక్షలు) ఉండగా.. శంకర్ లల్వానీ దాన్ని అధిగమించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







