అఖండ విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు: చంద్రబాబు
- June 05, 2024
హైదరాబాద్: అఖండ విజయాన్ని అందించినందుకు రాష్ట్ర ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని ఎన్నో త్యాగాలు చేశామని చంద్రబాబు అన్నారు. ఎన్నో ఎన్నికలు చూశాం. తెలుగుదేశం చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో హిస్టారికల్ ఎన్నిక ఇది అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ..
- అహంకారంతో ముందుకు వెళ్లే వారికి ప్రజలకు గుణపాఠం చెప్పారు.
- గత ప్రభుత్వంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలని ఎన్నో త్యాగాలు చేశాం.
- అధికారం శాశ్వతం కాదు పార్టీలు కూడా కనుమరుగయ్యాయి.
- విదేశాల్లో ఉన్నవారుసైతం ఓటు వేసేందుకు వచ్చారు.
- నా అనుభవంలో ఎన్నో ఎన్నికలు చూశాను. ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
- 58.38శాతం కూటమికి ఓట్లు వచ్చాయి.
- 45.06 శాతం టీడీపీకి, 39శాతం వైసీపీకి ఓట్లు వచ్చాయి.
- నియంతృత్వం, విచ్చలవిడితనాన్ని ప్రజలు సహించలేదు.
- అహకారంతో ముందుకు వెళ్లేవారికి ప్రజలు గుణపాఠం చెప్పారు.
- అవినీతి, అహంకారంతో ముందుకుపోయే విధ్వంసకారులకు ఇదే జరుగుతుందని ప్రజలు ఈ ఫలితాల ద్వారా నిరూపించారు.
- ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు కంటినిండా నిద్రపోని పరిస్థితి. హింసపెడుతూ ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనాలి అనేలా చేశారు. ఈ క్రమలో చంద్రయ్య అనే కార్యకర్త ప్రాణాలుసైతం విడిచారు.
- ఒక్క టీడీపీ కార్యకర్తలకే కాదు. ఐదేళ్లుగా మీడియాకూడా ఇబ్బంది పడింది.
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఇబ్బంది పెట్టారు. కేసులు పెడితే ఎందుకు పెట్టావ్ అని అడిగితే అరెస్టు చేస్తున్నాం.. తరువాత కేసు డీటేల్స్ ఇస్తామని చెప్పారు.
- ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకోనేలా ఐదేళ్లు అనేక సంఘంటనలు జరిగాయి.
- ఇది మాకు అధికారం అని అనుకోవటం లేదు.. బాధ్యత.
- మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఆ మేరకు పనిచేస్తాం.
- టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. నా శపథానికి ప్రజలు మద్దతు ఇచ్చారు..
అసెంబ్లీలో నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానం మర్చిపోలేనిది. నా పై బాంబులు వేసిన రోజుకూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని.. అసెంబ్లీలో జరిగిన సంఘటనతో ఇలాంటి కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చా. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీలోకి వస్తానని శబథం చేశా. నాకు ప్రజలు అండగా నిలబడి మరోసారి అసెంబ్లీకి పంపించారు. నా గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరుణం తీర్చుకుంటాం. మీ అంచనాల ప్రకారం పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనాయకత్వం నరేంద్ర మోదీ, అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరం, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కలిసిముందుకు సాగారు.ఈ విజయం బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల సమిష్టి కృషి అని చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..