జూన్ 21న బహ్రెయిన్‌లో యోగా దినోత్సవం
- June 11, 2016
బహ్రెయిన్ కింగ్డమ్, జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని నిర్వహించనుంది. యోగా పట్ల అవగాహన, ఉత్సవాల్లో భాగంగా భారతదేశం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీన్ని బహ్రెయిన్ కింగ్డమ్లో కూడా అధికారికంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మినిస్టర్ ఆహెల్త్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలే, జూన్ 21న జరిగే యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇండియన్ ఎంబసీ మరియు ప్రిన్స్ అల్జవ్హరా సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసన్ అండ్ ఇన్హెరిటెడ్ డిజార్టర్స్ కూడా ఈ కార్యక్రమానికి మద్దతివ్వనున్నాయి. ప్రిన్సెస్ అల్ సవహరా ఇ్బహీమ్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసన్, సలమానియా మెడికల్ కాంప్లెక్స్ - ప్రొఫెసర్ రఫియా ఫఘుబాష్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రిజిస్ట్రేషన్లు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. ఇండియన్ ంబాసిడర్ అలోక్ కుమాన సిన్హాతో కలిసి హెల్త్ మినిస్టర్ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డైరెక్టర్ సమిర్ ఇంతియార్ అల్దరాబి గెస్ట్ స్పీకర్‌గా వ్యవహరిస్తారు. పార్టిసిపెంట్లకు వివిధ రకాలైన యోగా టెక్నిక్స్ కలిగి ఉన్న బుక్లెట్ని అందజేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీన్ని ప్రచురించింది. అలాగే యోగా సిడి కూడా ఇందులో పొందుపర్చారు. బహ్రెయిన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన క్యాన్సర్ కేర్ గ్రూప్ కూడా ఇందులో పాల్గొంటుంది. డిసెంబర్ 11, 2014న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యోగా డే జూన్ 21న నిర్వహించాలని ప్రకటించింది. యోగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







