స్కూల్ టాపర్లను సత్కరించిన ఇండియన్ స్కూల్

- June 05, 2024 , by Maagulf
స్కూల్ టాపర్లను సత్కరించిన ఇండియన్ స్కూల్

 మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ మే 30న CBSE పరీక్షల్లో విద్యార్థులు సాధించిన అత్యుత్తమ విజయాలను పురస్కరించుకుని వార్షిక అకడమిక్ అవార్డు వేడుకను నిర్వహించింది. ఇసా టౌన్ క్యాంపస్‌లోని జషన్మల్ ఆడిటోరియంలో 2023-2024 విద్యాసంవత్సరంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన X మరియు XII గ్రేడ్‌ల నుండి సుమారు 260 మంది అత్యుత్తమ విద్యార్థులకు పతకాలు,  సర్టిఫికేట్‌లను అందజేసారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె జాకబ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, వైకె అల్మోయ్యద్ అండ్ సన్స్ డైరెక్టర్ హలా ఫరూక్ అల్మోయ్యద్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఎంబసీ అటాచ్ (ఎడ్యుకేషన్) రాజేంద్ర కుమార్ మీనా, చైర్మన్ బిను మన్నిల్ వరుగీస్, సెక్రటరీ వి రాజపాండియన్ మరియు వైస్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ ఫైజల్ కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com