ఆరో రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

- June 06, 2024 , by Maagulf
ఆరో రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

కువైట్: సులైబియాకు ఎదురుగా ఉన్న ఆరవ రింగ్ రోడ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 15 మందికి గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటనలో 51 ఏళ్ల సిరియన్ ప్రవాసుడు మరణించగా  ఈజిప్షియన్, సిరియన్ మరియు పాకిస్తాన్ జాతీయులతో సహా 14 మంది ప్రవాసులు, అలాగే ఒక కువైట్ పౌరుడు గాయపడ్డారు.  భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంఘటన బుధవారం జరిగింది. బోల్తా పడిన వాహనం అయిన డ్రైవర్ ( సిరియన్)  మరణించాడు. పారామెడిక్స్ టీమ్ గాయపడిన బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com