‘కల్కి’.! మళ్లీ మాట తప్పారుగా.!
- June 06, 2024
ఇంకేముంది అనుకున్న టైమ్ కన్నా ముందుగానే ’కల్కి‘ ట్రైలర్ రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు. దాంతో ప్రబాస్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అయితే, ఆ అనౌన్స్మెంట్ నిజం కాలేదు.
జూన్ 7 వ తీదీన రిలీజ్ చేస్తామన్న ‘కల్కి’ ట్రైలర్ జూన్ 10 వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. 27న సినిమా రిలీజ్ వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ విషయంలోనే ఎన్నో వాయిదాలు జరిగాయ్. ఇప్పుడు ట్రైలర్ విషయంలోనూ ఇలా.!
అంతేకాదు, ప్రబాస్ సినిమాలన్నింటి విషయంలోనూ ఇలాంటివే జరుగుతుంటాయ్. కానీ, ‘కల్కి’ చాలా ప్రెస్టీజియస్ మూవీ. అలాగే భారీ బడ్జెట్‌తో అనేక భాషల్లో ప్యాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. అలాంటిది ఈ సినిమా విషయంలోనూ ప్రతీదీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇకపై వాయిదాల పర్వం నడిస్తే.. అస్సలు బాగోదు అని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







