పోలీసుల మరో యాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
- June 07, 2024
హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు చెందిన మరో యాప్‌ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు టీఎస్సీఓపీ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు.
యాప్‌లను హ్యాక్ చేసి అందులోని డేటాను కేటుగాళ్లు ఆన్ అమ్ముతున్నారు కేటుగాళ్లు. 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా ఇస్తామంంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ రెండు యాప్ లలో దాదాపు 12 లక్షల మందికి సంబంధించిన డేటా ఉన్నట్లు తెలుస్తోంది. వారి డేటానే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు సైబర్ కేటగాళ్లు.
కాగా, జనాలకు సత్వరమే సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాక్ ను రూపొందించిన విషయం తెలిసిందే. దీని వేదికగా చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇందులో చాలా మంది పౌరుల ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. హ్యాకర్లను గుర్తించేందుకు పోలీసుులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







