సౌదీ అరేబియా సెమీకండక్టర్ హబ్ ఏర్పాటు
- June 08, 2024
రియాద్: SR1 బిలియన్ ($266.6 మిలియన్లు) పెట్టుబడితో నేషనల్ సెమీకండక్టర్ హబ్ స్థాపించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అధిక డిమాండ్ ఉన్న చిప్‌లను రూపొందించడానికి 50 కంపెనీలను స్థాపించే ప్రయత్నాల్లో ఇది భాగం అని వెల్లడించింది. ఈ మేరకు రియాద్‌లో ఫ్యూచర్ ఆఫ్ సెమీకండక్టర్ ఫోరమ్ 2024 ప్రారంభ సెషన్లో నేషనల్ సెమీకండక్టర్ హబ్ ప్రారంభించినట్టు ప్రకటించారు. నేషనల్ సెమీకండక్టర్ హబ్ ద్వారా సౌదీ అరేబియా 25 అంతర్జాతీయ సెమీకండక్టర్ కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని ర్యాపిడ్ సిలికాన్ సీఈఓ డా. నవీద్ షెర్వానీ తెలిపారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఫిబ్రవరి 2024లో ప్రారంభించిన అలాలత్ కంపెనీ సెమీకండక్టర్ తయారీకి జాతీయ ప్రాతిపదిక కావడం గమనార్హం. కింగ్ అబ్దుల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (KAUST) సహకారంతో కింగ్ అబ్దుల్లాజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KACST) "ఎంపవర్రింగ్ సిలికాన్ ఇన్నోవేషన్స్" పేరుతో రెండు రోజుల ఫోరమ్‌ను నిర్వహించింది. ఫోరమ్‌లో 20 స్థానిక, అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ సెమీకండక్టర్స్ మరియు ఈ రంగానికి సంబంధించిన రీసెర్చ్ పోస్టర్లలో సరికొత్త పురోగతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







