అబుధాబిలో కేరళ మహిళ మృతి...

- June 08, 2024 , by Maagulf
అబుధాబిలో కేరళ మహిళ మృతి...

అబుధాబి: కేరళకు చెందిన మహిళ అబుధాబిలో శవమై కనిపించింది.భర్త పరిస్థితి విషమంగా ఉంది.అయితే ఇది హత్య లేక ఆత్మహత్య అనేది తెలియరాలేదు.వివరాల్లోకి వెళితే..కేరళలోని కన్నూర్ చిరక్కల్ మడత్తుకుండి పరప్పురానికి చెందిన మనోగ్నకు లినెక్‌తో 2021 ఏప్రిల్ 17న వివాహం జరిగింది. ఉన్నతంగా బతకాలన్న ఉద్దేశంతో ఏడాదిన్నర క్రితం అబుదాబీకి వచ్చారు. మనోగ్న వెబ్ డెవలపర్‌గా పనిచేస్తుంది.లినెక్ ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు.అయితే ఆదివారం నుండి భార్యా భర్తలిద్దరూ ఫోన్లకు స్పందించడం లేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు.ఏం జరిగిందో చూడాలంటూ అబుధాబిలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు.

రెండు రోజుల తర్వాత దంపతులు నివసిస్తున్న ఇంటికి వెళ్లి చూడగా..మనోగ్న నరాలు తెగిపోయి కనిపించింది. అలాగే భర్తకు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అతడు మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా, ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారని తెలుస్తుంది. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ముమ్మాటికి హత్యే అని ఆ అమ్మాయి తరుఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. వారి ఇంటి నుండి శబ్దాలు, అరుపులు వినిపించాయని అంటున్నారు. అతడే ఆమెను హత్య చేసి..ఆ పై అతడు నరం కట్ చేసుకుని ఉంటాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత ఎంబసీ సాయాన్ని కోరారు కుటుంబ సభ్యులు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com