దుబాయ్ లో తెలంగాణ దశాబ్ది సంబరాలు

- June 08, 2024 , by Maagulf
దుబాయ్ లో తెలంగాణ దశాబ్ది సంబరాలు

దుబాయ్: దుబాయ్ లో తెలంగాణ దశాబ్ది సంబరాలను నిర్వహించనున్నారు. జూన్ 9న ముహైస్నా ఎసిలాట్ అకాడమీలో ఆదివారం సాయంత్రం 5 గంటలను నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అమరవీరుల స్మరణ, తెలంగాణ జానపద పాటు, తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి, సినీగేయ రచయిత డాక్టర్ అందెశ్రీ చీఫ్ గెస్టుగా హాజరు కానున్నారు.తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహిష్ కుమార్ గౌడ్, టీడబ్ల్యూఆర్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ కో-ఫౌండర్ వీరమళ్ల ప్రకాశరావు గౌరవ అతిథులుగా హాజరవుతారు. వీరితోపాటు మూవీ డైరెక్టర్ వినయ్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్,సింగర్, రైటర్ మిట్టెపల్లి సురెందర్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కో- ఆర్డినేటర్ వంగి దేవేందర్ రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ జి.అనూహ్య రెడ్డి స్పెషల్ గెస్టులుగా సంబరాల్లో పాల్గొంటారని నిర్వహకులు స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా  తెలిపారు. ఫోక్ సింటర్లు సాని యడర్ల, లాస్య, అల్లయిలె మహేష్, మల్లేష్ కోరేపు, మాపల్లె శంకర్ పాల్గొంటారు. మాగల్ఫ్ మీడియా పార్టనర్ గా వ్యవహారిస్తోంది. మరిన్ని వివరాలకు అరుణ్ (050-6590755), లావణ్య (056-6511455), మల్లేష్ (055-4548391) సంప్రదించవచ్చు. రెగ్యులర్ కేటగిరీ వారికి ప్రవేశం ఉచితం. అయితే, ముందుగా రిజిస్ట్రేషన్ (https://forms.gle/69t6q55LJ8tqAAjUA) చేసుకోవాలి. VIP కేటగిరీ వారికి 25 AED టికెట్ ధరను నిర్ణయించారు. Q tickets లో బుక్ చేసుకున్న వారికి సీట్లు కేటాయించబడుతాయని వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com