రామోజీరావు మృతి పట్ల NATS సంతాపం
- June 08, 2024
అమెరికా: తెలుగుజాతి ముద్దు బిడ్డ...తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష వైభవానికి రామోజీరావు చేసిన కృషి మరువలేనిదన్నారు.ప్రతి తెలుగువాడికి రామోజీరావు జీవితం ఓ స్ఫూర్తిదాయక పాఠమని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. రామోజీరావు ఈనాడు, ఈటీవీ సంస్థలను ఉన్నత విలువల ఉన్న సంస్థలుగా నిలబెట్టి మనందరికి విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. రామోజీరావు మరణవార్త అమెరికాలో ఉండే తెలుగువారందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపాన్ని వెలిబుచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నాట్స్ సభ్యులు ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..