చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సిఎస్ సమీక్ష
- June 09, 2024
విజయవాడ: ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గన్నవరం విమానాశ్రయంలో వివిఐపిలు,విఐపిలు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులను సిఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, తదితర వాహనాల పార్కింగ్ కు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సిఎస్ సమీక్షించారు.
డిజిపి హరీశ్ కుమార్ గుప్త మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు యం.రవిచంద్ర, శశి భూషణ్ కుమార్, అదనపు డిజిపి ఎస్.బాగ్చి, టిఆర్ అండ్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలు, ఉద్యానవన శాఖల కమీషనర్లు అరుణ్ కుమార్, శ్రీధర్, సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్, ఎపి జెన్కో సిఎండి చక్రధర్ బాబు పాల్గొన్నారు.
ఇంకా ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్,సివిల్ కార్పొరేషన్ ఎండి వీరపాండ్యన్ కృష్ణా, ఎన్టిఆర్ జిల్లాల కలెక్టర్లు డికె బాలాజీ,డిల్లీ రావు, విజయవాడ పోలీస్ కమీషనర్ పిహెచ్ డి రామకృష్ణ,డిఐజి రాజశేఖర్ బాబు,డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ రమణ,మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టిఆర్ జిల్లా జెసి సంపత్ కుమార్,కృష్ణా జిల్లా ఎస్పి ఎ.నయీమ్ హస్మి,గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి,అండ్ పిఆర్ అదనపు డైరైక్టర్ ఎల్.స్వర్ణ లత, ఎంఎల్ సి అశోక్ బాబు తదితర ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..