ఎన్టీఆర్ హీరోగా వైవిఎస్ చౌదరి సినిమా అనౌన్స్..
- June 10, 2024
హైదరాబాద్: గతంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ పడటం, నిర్మాతగా కూడా లాస్ అవ్వడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.
దాదాపు 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు వైవిఎస్ చౌదరి. సీనియర్ ఎన్టీఆర్ కి వైవిఎస్ చౌదరి వీరాభిమాని అని తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వైవిఎస్ కొత్త హీరోని పరిచయం చేయబోతూ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. తన భార్య యలమంచలి గీత నిర్మాతగా న్యూ ట్యాలెంట్ రోర్స్@(NTR@) అనే కొత్త బ్యానర్ పై ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నారు.
దివంగత నందమూరి హరికృష్ణ(Harikrishna) మనవడు, దివంగత నందమూరి జానకిరామ్(Janaki Ram) పెద్ద కొడుకుని వైవిఎస్ చౌదరి హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. దీంతో ఈ కొత్త ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి హీరోగా లాంచ్ చేస్తున్నారు. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించి సినిమాని ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో కొత్త తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు. అయితే ఆ కొత్త ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనేది మాత్రం చూపించలేదు. త్వరలో మరో ఈవెంట్ పెట్టి కొత్త ఎన్టీఆర్ ని, హీరోయిన్ ని పరిచయం చేస్తామని ప్రకటించారు.
మరి ఈ కొత్త ఎన్టీఆర్(NTR) తన తాత, ముత్తాత, బాబాయ్ లాగే నటనలో మెప్పిస్తాడా చూడాలి. వైవిఎస్ చౌదరి కూడా రీ ఎంట్రీతో మళ్ళీహీట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడా చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







