#NBK109 బాలయ్యకి వెరీ వెరీ స్పెషల్.!
- June 11, 2024
ఓ వైపు రాజకీయాల్లో విజయం సాధించి మరో వైపు సినిమాల్లోనూ కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు నందమూరి బాలయ్య.
ఇదే ఉత్సాహంతో తన 109వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయాల్సి వుంది.
ఆ సినిమాని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు, బాలయ్య సినిమా కెరీర్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన 109వ చిత్రం లాంఛింగ్ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారట.
అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు, ప్రస్తుతం బాలయ్యకు గుడ్ టైమ్ నడుస్తోంది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయ్. సో, ఈ సినిమా బాలయ్య కెరీర్లో అదీ ఈ టైమ్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
‘వీరమాస్’ అనే టైటిల్ ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్







