హైదరాబాద్ టూ షిర్డీ టూర్..సూపర్ ప్యాకేజీ
- June 10, 2024
హైదరాబాద్: తెలంగాణలో సమ్మర్ హాలీడేస్ ముగుస్తున్న వేళ చాలా మంది చివరి దశలో టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలోనే టూర్‌ను పూర్తి చేసేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.ఇలాంటి ఓ బెస్ట్ టూర్ ప్యాకేజీలో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కేవలం రెండు రోజుల్లోనే టూర్ ముగిసేలా ఈ ప్యాకేజీని అందిస్తున్నారు.హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీలో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. షిర్డీ-ఫ్లైట్ ప్యాకేజీ-తెలంగాణ టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ టూర్ ప్యాకేజీలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- తొలి రోజు టూర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమవుతుంది.మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి జర్నీ ప్రారంభమవుతుంది.
- మధ్యాహ్నం 2.50 గంటలకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3.30 గంటలకు హోటల్లో చెకిన్ అవుతారు.అనంతరం కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాయిబాబా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది.
- ఇక రాత్రి 7 గంటల నుంచి 7.30 మధ్య థీమ్ పార్క్‌లో షో ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. తిరిగి 9 గంటల వరకు హోటల్‌కు చేరుకుంటారు.
- ఇక రెండో రోజు మార్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పంచముఖి గణపతి టెంపుల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఓల్డ్ షిర్డీ సందర్శన ఉంటుంది. ఇందులో భాగంగా కండొబా మందిర్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో తిరుగు ప్రయాణం ఉంటుంది.
ప్యాకేజీ ధర వివరాలు..
ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే రూ. 12,499గా నిర్ణయించారు. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్‌తో పాటు వసతి సౌకర్యం ఉంటుంది. సందేహాలు, పూర్తి వివరాల కోసం 9848540371 ఫోన్ నెంబర్ లేదా https://tourism.telangana.gov.in/home వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..