అల్లు అర్జున్ పనైపోయిందా.?
- June 11, 2024
అల్లు ఫ్యామిలీకీ, మెగా ఫ్యామిలీకి మధ్య ఏదో కిరికిరి వుందంటూ ఎప్పటికప్పుడే ప్రచారం జరుగుతుంటుంది. కానీ, అది తప్పుడు ప్రచారం అని ఖండిస్తూ వుంటారు.
తాజాగా ఇంకోసారి ఇదే ప్రచారం జోరందుకుంది. అందుకు కారణం తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలుపు సాధించడం.. ఆ గెలుపు ఏకంగా కేంద్రంలో వున్న మోడీనే ప్రభావితం చేయడం.. ఇలా రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ విజయోత్సవాన్ని మెగా కుటుంబం సంబరంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ సంబరంలో అల్లు ఫ్యామిలీ ఎక్కడా కనిపించింది లేదు. అంతకు ముందే ఎలక్షన్ ప్రచారంలో భాగంగానూ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిని తన ఫ్రెండ్ అని చెప్పి కలవడం.. పవన్ కళ్యాణ్‌ని కలవకపోవడం.. తదితర అంశాలు అల్లు ఫ్యామిలీకీ, మెగా ఫ్యామిలీకి గ్యాప్ వచ్చిన అంశాన్ని మరోసారి ప్రూవ్ చేస్తున్నాయ్.
అసలు మ్యాటర్ ఏంటంటే, మెగా ఫ్యామిలీ నీడనే అల్లు ఫ్యామిలీ ఎదిగింది.. ఎవ్వరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా ఇది అక్షర సత్యం. కానీ, గత కొంతకాలంగా అల్లు అర్జున్ తన ఉనికిని ప్రత్యేకంగా కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఆయన చేసిన పలు పబ్లిసిటీ కార్యక్రమాలను ప్రామాణికంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ వున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫ్యూచర్‌లో అల్లు అర్జున్ కెరీర్ పరిస్థితేంటీ.! అల్లు అర్జున్ తన ఆటిట్యూడ్ కాస్త తగ్గించుకోకుండా చిక్కుల్లో పడ్డట్లే అని కొందరు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







