ప్రెగ్నెన్సీ టైమ్‌లో బిడ్డ ఆరోగ్యం కోసం తీసుకోవల్సిన కనీస జాగ్రత్తలు.!

- June 11, 2024 , by Maagulf
ప్రెగ్నెన్సీ టైమ్‌లో బిడ్డ ఆరోగ్యం కోసం తీసుకోవల్సిన కనీస జాగ్రత్తలు.!

గర్భధారణ అనేది ఓ వరం. ఆ టైమ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే అవి బిడ్డ ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయ్.
అందులో ముఖ్యమైనవి ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ ఎక్కువగా తీసుకోకూడదు కాబోయే తల్లి. షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది బిడ్డ రూపంపై ప్రభావితం చూపిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది.
పుట్టే బిడ్డ చక్కటి రూపంతో పుట్టాలని అందరూ అనుకుంటారు. కానీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల అది పుట్టబోయే బిడ్డకు దీర్ఘ కాలిక వ్యాధులు పరిణమించే ప్రమాదాన్ని సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తుంది.
అలాగే ఎక్కువగా కాలుష్యం వున్న ప్రదేశాల్లో తిరగకూడదని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన కాలుష్యం బిడ్డ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లున్న ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు పాలు ప్రధమంగా తీసుకోవాలని చెబుతారు. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం పాలు ఎక్కువగా తాగడం వల్ల గర్భిణీ స్త్రీలు బరువు పెరుగుతారు. తద్వారా పుట్టే బిడ్డకీ ఊబకాయ సమస్యలొచ్చే అవకాశాలున్నాయని తాజాగా సర్వేల్లో తేలింది.
సో, పాలను రోజులో ఒక్కసారి మాత్రమే తాగాలని సూచిస్తున్నారు.పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. 15వ వారం నుంచి కడుపులోని బిడ్డకు జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది. సో, ఆ టైమ్ నుంచి ప్రొటీన్లు ఎక్కువగా వుండేలా ఉడికించిన గుడ్డు తదితర ఆహారాలు తీసుకోవాలి.
వేరు శెనగలు కడుపులోని బిడ్డకు మంచి ఆరోగ్యాన్నిస్తాయ్. అలాగే గర్భిణికీ శక్తినందించడంలో తోడ్పడతాయ్. సో, బెల్లం కలిపిన వేరుశెనగల (చిక్కీ)ను తీసుకుంటే మంచిది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com