విద్యుత్ కోనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు
- June 11, 2024
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై ఆయన వివరణ కోరారు. ఈ నెలలోగా వివరణ ఇవ్వాలని చెప్పారు.
అయితే, అందుకు జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఇప్పటివరకు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామని, అందరూ వివరణ ఇచ్చారని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఒకవేళ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉండకపోతే తమ ముందు మళ్లీ విచారణకు రావాల్సిందేనని అన్నారు.
కాగా, ఇప్పటికే థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ కంపెనీలు చేసుకున్న ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి, అందుకు జస్టిస్ నరసింహారెడ్డిని ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షలు కూడా నిర్వహించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..