ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
- June 11, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం చంద్రబాబును శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు అందించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతల తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు.
గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం ఉదయం 11.24 గంటలకు అమరావతిలోని కేసరవల్లి ఐటీ పార్క్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి బండి సంజయ్ మరి కొందరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..