యూఏఈలో రాబోయే రోజుల్లో నియామకాలు ఫ్రీజ్..!
- June 13, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లోని మెజారిటీ కంపెనీలు (63 శాతం) రాబోయే 12 నెలల్లో తమ హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని యోచిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని నియామకాలను ఆలస్యం చేయాలని, లేదా కొత్త రిక్రూట్‌మెంట్‌ను స్తంభింపజేస్తాయని ఒక అధ్యయనం తెలిపింది. రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ రాబర్ట్ హాఫ్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఎకనామిక్ పిక్చర్ - బహుళ ఎన్నికల షెడ్యూల్, అస్థిర ద్రవ్యోల్బణం యూఏఈ వ్యాపార పనితీరుకు అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటన్నారు. దీంతో అనేక మంది నియామక కార్యకలాపాలను కొంత కాలానికి ఫ్రీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈలోని 100 మంది సీనియర్ వ్యాపార నిర్ణయాధికారుల అభిప్రాయాలతో ఈ సర్వే నిర్వహించారు. మూడింట ఒక వంతు ( 33 శాతం) యూఏఈ వ్యాపార ప్రముఖులు ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా అమెరికా, యూకే లలో ఎన్నికల ఫలితాలు తెలిసే వరకు నియామక నిర్ణయాల కోసం వేచి ఉన్నామని చెప్పారు. 32 శాతం మంది ఆయా దేశాల్లో వడ్డీ రేట్లు స్థిరీకరించడానికి వేచి ఉన్నారు. మరోవైపు యూఏఈలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో తమ సంస్థ నియామకాలు ఫ్రీజ్ చేయాలని యోచిస్తున్నట్లు యూఏఈ ఎగ్జిక్యూటివ్‌లలో ముగ్గురిలో ఒకరు (29 శాతం) అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









