మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

- June 13, 2024 , by Maagulf
మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని అన్నారు. మనపై కేసులు పెట్టినా బయపడొద్దని చెప్పారు. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. మనం చేసిన మంచి పనులు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని అన్నారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ హనీమూన్ నడుస్తోందని చురకలు అంటించారు. వారికి మరికొంత సమయం ఇద్దామని పేర్కొన్నారు. ఆ తరువాత ప్రజల తరఫున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం ఉందని అన్నారు. మండలిలో గట్టిగ పోరాడుదాం అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com