యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం అదే: ఆర్జీవీ
- June 15, 2024
హైదరాబాద్: ''చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ 'ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్' లక్ష్యం'' అన్నారు దర్శక-నిర్మాత రామ్ గోపాల్ వర్మ.
శుక్రవారం విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ- ''నా మొదటి సినిమా 'శివ' అప్పుడు నా గురించి ఎవరికీ తెలియదు. ఆ చిత్రం హిట్టవ్వడం వల్లే నేనెవరో అందరికీ తెలిసింది. మా నాన్న అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చేందుకు నాకు వీలు దొరికింది. కానీ ప్రతిభ ఉండి నాలాగా ఇంకా ప్రపంచానికి తెలియాల్సిన వారు ఎందరో బయట ఉన్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్.
ఈ కాంటెస్ట్‌కి వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్‌ని ఎంపిక చేశాం. వీటిని సోషల్ మీడియాల పోల్‌కు పెట్టి ప్రేక్షకులు ఎక్కువ మంది బెస్ట్ డైరెక్టర్‌గా ఓటు వేసిన వారికి మా సంస్థలో చాన్స్ ఇస్తాం. డైరెక్టర్స్ అనే కాదు కెమెరా, మ్యూజిక్ డైరెక్షన్ ఇలా.. ప్రతి క్రాఫ్టులో ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేస్తున్నాం. సెలెక్ట్ అయిన వారి ప్రతిభను ముందుగా మా సంస్థలో ఉపయోగించుకోవాలనేది నా, నిర్మాత రవి స్వార్థం'' అన్నారు. నిర్మాత రవి కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







