మాస్ రాజా స్పీడు మామూలుగా లేదుగా.!
- June 15, 2024
మాస్ రాజా రవితేజకు ‘ధమాకా’తో మంచి హిట్టొచ్చింది. ‘వాల్తేర్ వీరయ్య’తో ఆ సక్సెస్ కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత మళ్లీ చతికిలబడ్డాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు ఫెయిల్యూర్స్ ఇచ్చేశాడు.
ఇప్పుడు మళ్లీ రెండు సినిమాల్ని పట్టాలెక్కించాడు. వాటిలో ‘మిస్టర్ బచ్చన్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘షాక్’, ‘మిరపకాయ్’ తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. అంచనాలు బాగున్నాయ్.
ఓ పక్క మెడ నొప్పి వున్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా శరవేగంగా ఈ షూటింగ్ పూర్తి చేయాలని కష్టపడుతున్నాడు మాస్ రాజా. కొత్త భామ భానుశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది.
ఈ సంగతి అలా వుంటే, తన 75వ చిత్రాన్ని సైతం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించేశాడు రవితేజ. ఈ సినిమాలో ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీలతో జత కడుతున్నాడు మాస్ రాజా. సైమల్టేనియస్‌గా ఈ రెండు చిత్రాల్నీ పూర్తి చేసే యోచనలో మాస్ రాజా వున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు భాను భీమవరపు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









