బెల్లంతో ఆరోగ్యం.! మీకీ విషయాలు తెలుసా.?
- June 17, 2024
పంచదారతో పోల్చితే బెల్లం ఎప్పుడూ ఆరోగ్యకరమే అని చాలా మందికి తెలుసు. కానీ, టేస్ట్ కోసం అన్నింట్లోనూ బెల్లాన్ని వాడకుండా, ప్రత్యామ్నాయంగా పంచదారను ఉపయోగిస్తుంటారు.
కానీ, బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. పంచదార జోలికి పోనే పోరని అంటున్నారు నిపుణులు. బెల్లంలో కార్భోహైడ్రేట్లు అధికంగా వుంటాయ్. అవి శరీరానికి తక్షణ శక్తినివ్వడంలో తోడ్పడతాయ్.
అలాగే, బెల్లంలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. ఐరెన్ డెషిషియన్సీ వున్నవాళ్లు పంచదార తినడం మానేసి బెల్లం ప్రతీరోజూ తమ డైట్లో చేర్చుకోవడం వుత్తమమని చెబుతారు. అధిక రక్తపోటు సమస్య వున్నవారికి సైతం బెల్లం ఓ దివ్యౌషధంగా చెబుతున్నారు.
అలాగే, ప్రతీరోజూ పరగడుపున చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే, జీర్ణశక్తి మెరుగవుతుంది. పెరుగన్నంలో బెల్లం ముక్క నంచుకునే అలవాటు చాలా మందికి వుంటుంది. నిజంగానే ఆ అలవాటు ఆరోగ్యపరంగా చాలా మంచిదని తాజా సర్వేలో తేలింది.
అంతేకాదు, బెల్లం తినేవారిలో బరువు సమస్యలు కూడా వుండనని చెబుతున్నారు. వయసుతో పాటూ వచ్చే కీళ్ల నొప్పులు, వాత సమస్యలు బెల్లం వాడకం ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







