షాకింగ్: ‘ఇండియన్ 2’లో ‘ఆమె’ కూడానా.?

- June 17, 2024 , by Maagulf
షాకింగ్: ‘ఇండియన్ 2’లో ‘ఆమె’ కూడానా.?

శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి ‘ఇండియన్’. తెలుగులో ‘భారతీయుడు’ టైటిల్‌తో రిలీజయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. కాగా, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారు.

సీక్వెల్ తెరకెక్కించడం శంకర్‌కి కత్తి మీద సామే అయిన సంగతి అందరికీ తెలిసిందే. కష్టాలను ఓర్చి ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశారు డైరెక్టర్ శంకర్.

అలాగే జులై 12న రిలీజ్‌కి కూడా సిద్ధమైంది. కమల్ హాసన్‌తో పాటూ, సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మనీషా కోయిరాల కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వెరీ లేటెస్ట్‌గా శంకర్‌తో మనీషా కోయిరాల దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడమే ఈ న్యూస్ సర్క్యులేట్ కావడానికి కారణం.

‘ఇండియన్’ మొదటి పార్ట్‌లో మనీషా కోయిరాల తనదైన అందచందాలతో కుర్రోళ్లను కట్టి పడేసిన సంగతి తెలిసిందే. ఈ పార్ట్‌లో కూడా ఆమెను ఓ గెస్ట్ రోల్‌లో కొన్ని సెకన్ల పాటు చూపించబోతున్నారనీ, అయితే, ప్రస్తుతానికి ఆ క్యారెక్టర్‌ని సస్పెన్స్‌గా వుంచారనీ తెలుస్తోంది.

అన్నట్లు రీసెంట్‌గా ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్‌లో మనీషా కోయిరాల స్టన్నింగ్ పర్‌ఫామెన్స్‌కి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అయిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com