మక్కా గ్రాండ్ మసీదు వద్ద 51.8°C ఉష్ణోగ్రతలు నమోదు
- June 18, 2024
సౌదీ: సౌదీ అరేబియా సోమవారం మక్కాలో ఉష్ణోగ్రత పెరుగుదల గురించి హెచ్చరించింది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో హజ్ ఒకటి. ఆదివారం ఒక్కరోజే 2,700 కంటే ఎక్కువ "వేడి" సంబంధిత కేసులను నమోదు చేసినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం, సౌదీ వాతావరణ సేవ ప్రకారం, మక్కా గ్రాండ్ మసీదు వద్ద ఉష్ణోగ్రతలు 51.8 డిగ్రీల సెల్సియస్ (125 డిగ్రీల ఫారెన్హీట్)కి చేరుకున్నాయి. ఇక్కడ యాత్రికులు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సమీపంలోని మినాలో, ఉష్ణోగ్రత 46C అని జాతీయ వాతావరణ సేవ ప్రతినిధి చెప్పారు.
జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బకు గురై మరణించారని మరియు మరో 17 మంది ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఐదుగురు యాత్రికుల మరణాలను ఇరాన్ నివేదించింది. అయితే కారణాన్ని పేర్కొనలేదు. సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ.. హజ్ సమయంలో కనీసం ముగ్గురు హీట్ స్ట్రోక్తో సహా 136 మంది ఇండోనేషియా యాత్రికులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







